కంగారెందుకు? హైదరాబాద్‌లో ఆందోళనలపై కేటీఆర్‌కు లోకేష్ కౌంటర్
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు నారా లోకేష్. ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టుపై టీడీపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషలు నిరసన తెలుపుతుంటే, తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో వద్దని చెప్పడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై దేశ వ్యాప్తంగానూ, ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సంఘీభావం తెలిపారన్నారు. అందులో ఎలాంటి తప్పులేదన్నారు లోకేష్. శాంతియుతంగా సంఘీభావం తెలుపుతున్నారని… దానికి ఎందుకు కంగారుపడుతున్నారని ప్రశ్నించారు. యూరప్, అమెరికాలో ఉన్న తెలుగువారు ప్రశాంతంగా ఉన్నారని… అలాగే రోడ్డుపైకి వచ్చి శాంతియుతంగా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారని… ఎక్కడా శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేయలేదన్నారు లోకేష్. పోరాటం శాంతియుతంగా చేయాలని చంద్రబాబు సూచించారని తాజాగా లోకేష్ చెప్పారు. ఆస్తుల విధ్వంసం చేయొద్దని చెప్పారని అన్నారు.

