InternationalNews

ఇంగ్లాండ్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదనికి రాజీనామా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయానని.. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు లిజ్ ట్రస్. మరో వ్యక్తిని ఎన్నుకునే వరకు తాను ప్రధానిగా కొనసాగుతానని ట్రస్ చెప్పారు. వచ్చే వారం చివరి నాటికి బ్రిటన్‌కు కొత్త ప్రధాని వచ్చే అవకాశం ఉంది. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ కేవలం ఆరు వారాలు అంటే 45 రోజులు మాత్రమే బాధ్యతల్లో కొనసాగారు. ఎన్నికకు ముందు బ్రిటన్ ప్రధానిగా ఏం చేస్తానో వివరించిన ట్రస్.. చివరకు తాను ఏమీ చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. ట్రస్ రాజీనామా ప్రకటనలో బ్రిటన్ మార్కెట్లు భారీగా దెబ్బతిన్నాయ్. బ్రిటన్ కొత్త ప్రధాని ఈ నెలాఖరు వరకు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

యూకేను గాడిలో పెడతానని బరిలోకి వచ్చారు లిజ్ ట్రస్. అధికారంలోకి రాగానే మినీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుందంటూ.. విమర్శలు వెల్లువెత్తాయి. అవిశ్వాసం పెట్టేందుకు ప్రత్యర్థి పార్టీ సిద్దమైంది. దీంతో తప్పులు చేశాం..క్షమించండి అంటూ..లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఆమె నిర్ణయాలతో ఇప్పటికే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. క్షమించండని కోరిన మరుసటి రోజే ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది.