Home Page SliderTelangana

లైవ్ ఫిష్ లారీ బోల్తా..చేపల కోసం జనం కొట్లాట

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఖమ్మం నుండి వరంగల్ వెళ్లే చేపల లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. లైవ్ ఫిష్ లారీలో చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదరుగా పడిపోయాయి. రోడ్డుపై అన్ని బతికున్న చేపలు దొరకడంతో వాటికోసం ప్రజలు ఎగబడ్డారు. వాటికోసం కొంత ఘర్షణ, కొట్లాట చోటుచేసుకున్నాయి. దీనితో పోలీసులు కల్పించుకుని, వారిని అదుపు  చేయవలసి వచ్చింది.