మువ్వన్నెల పతాకంతో బారులు తీరిన చిన్నారులు
ప్రతీ మదిలో భారత స్వాతంత్ర స్ఫూర్తి మేలుకొంటోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు భాగ్యనగరంలో జోరుగా ఊపందుకున్నాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ, దుకాణాల్లోనూ మువ్వన్నెల జెండా ముచ్చట గొలుపుతూ ఎగురుతోంది. స్కూలు పిల్లలకి పలు ప్రభుత్వ సంస్థలు జెండాలు పంచిపెడుతూ ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు ఉదయాన్నే కూకట్‌పల్లి నుండి JNTU వరకూ స్కూలు పిల్లలు జాతీయ పతాకాన్ని పట్టుకుని, బీజేపీ ప్రముఖుల అధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఆ దృశ్యం చూపరులను ఎంతో ఆకట్టుకుంది. పోలీసులు కూడా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ నినాదాలు చేస్తూ, ఉత్సాహ పరుస్తూ పిల్లలకు ఎంతో సహకరించారు. ఇలా నగరంలో చాలా పాఠశాలల విద్యార్థులు ముచ్చటగా త్రివర్ణపతాకంతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.