NationalNews

ఈ నెల 15వ తేదీ నుంచి ఉచితంగా కోవిడ్ టీకా బూస్టర్ డోస్..

Share with

దేశంలో మహమ్మరి మళ్లీ పంజా విసురుతుంది చాప కింద నీరులా కేసులు పెరుగుతున్నాయి. రోజు వారి కేసులు ఏకంగా 20వేలకు చేరాయి. కేసులు పెరుగుదలతో కేంద్రం రాష్ట్రాలను… కేంద్రం ఆప్రమత్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో పాజిటివిటీ రేటు 5 శాతనికి పెరిగింది. బుధవారం 3.94 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 20139 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ముందు రోజు కంటే 4 వేల కేసులు అదనంగా వచ్చాయి. దాంతో పాజిటివిటి రేటు 5.10 శాతం నమోదైంది. గురువారం కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 4.36 కోట్ల మంది కరోన బారిన పడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు లక్షా 36 వేలుగా చేరుకున్నాయ్. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.31 శాతానికి పెరగ్గా…. రీకవరి రేటు 98.49 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో 16482 మంది కోలుకున్నారు. 38 మంది మరణించారు. దేశంలో కరోనా మృతులు 5 లక్షల 25 వేలకు చేరుకొంది. కేంద్రం గత ఏడాది ప్రారభం నుంచి నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమం కింద 199 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 13.44 లక్షల మంది టీకా తీసుకున్నారు.ఆరు నెలల తర్వాత యాంటీబాడీల స్ధాయి తగ్గుతున్న విషయం ఐసీఎంఆర్ పరిశోధనా సంస్ధల అధ్యయనంలో తేలడంతో…..బూస్టర్ విషయంలో నిన్న కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ నెల 15వ తేదీ నుంచి ఉచితంగా కోవిడ్ టీకా బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.