NationalNews

లైగర్‌ ఫస్ట్‌ రివ్యూ వచ్చిందోచ్‌ !

`లైగర్’ సినిమా ఆగస్ట్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా రీలీజ్‌ కానుంది. ఈ చిత్రం విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్లో తెరకెక్కించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో విశేషమేమిటంటే ప్రపంచ హెవీ వెయిట్‌ మాజీ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్రలో నటించారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డు మెంబర్‌, బాలీవుడ్‌ ఫిలిం క్రిటిక్‌ ఉమైర్‌ సంధు ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా `లైగర్‌’ ఫస్ట్‌ రివ్యూను ఇచ్చారు. “సిటీ మార్‌  మాస్‌ ఎంటర్టయినర్‌ `లైగర్‌’. విజయ్‌ దేవరకొండ వన్‌ మేన్‌ షో చేశాడు. షో మొత్తాన్ని ఆయన దోచేశాడు. టెర్రిఫిక్‌ యాక్షన్‌ స్టంట్స్‌. డైరెక్షన్‌ అదిరిపోయింది. ఈ సినిమాలో రమ్యకృష్ణది ఒక సర్‌ ప్రైజ్‌ ప్యాకేజ్‌. అయితే స్టోరీ, స్క్రీన్‌ ప్లే మాత్రం యావరేజ్‌గా ఉన్నాయి“ అని ఉమైర్‌ సంధు తన రివ్యూలో పేర్కొన్నారు.