Andhra Pradesh

చెత్తపైన పన్ను వేస్తున్న సర్కారును సాగనంపుదాం… కన్నా లక్ష్మీనారాయణ

Share with

జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ… రాష్ట్రంలో ప్రజలపై ఇష్టానుసారంగా పన్నుల భారం మోపుతున్నారని ఆయన విమర్శించారు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని దుయ్యబట్టారు. చెత్త మీద కూడా పన్నువేసిన ఘనత జగన్ సర్కారుదేనని ఆరోపించారు. ప్రజలపై ఎడాపెడా భారం మోపుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు భారంగా భావిస్తున్నారని కన్నా మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రానికే పరిమితవుతున్నాయని… మెరుగైన వైద్య సేవలు ఎలా లభిస్తాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ సేవలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో బీజేపీ నేతల చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.