హెటిరో ల్యాబ్స్‌లో చిరుత.. ఎట్టకేలకు బంధించిన అధికారులు
గత కొంతకాలంగా చిరుతలు, పెద్ద పులులు జనారణ్యంలో సంచరిస్తున్నాయి. వీటి సంచారంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారంలోని హెటిరో ల్యాబ్ప్‌లో చిరుత సంతరించింది. పరిశ్రమలోని హెచ్ బ్లాక్‌లో దాక్కున్నది. దీంతో ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న నెహ్రూ జూ పార్క్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు చిరుతను బంధించారు. ఉదయం 4 గంటలకు ల్యాబ్ హెచ్ బ్లాక్‌లోకి చిరుత వచ్చింది. చిరుతను రాకను గమనించిన ల్యాబ్ సిబ్బంది బయటకు వచ్చి గదికి తాళం వేశారు. తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతను పట్టుకోవడానికి వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దాదాపు 11 గంటల సమయం తర్వాత చిరుతను బంధించేందుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో చిరుత మత్తులోకి జారుకోగానే బోనులో బంధించారు. చిరుతను అధికారులు జూపార్క్‌కు తరలించారు.

