Andhra PradeshHome Page SliderNews AlertPoliticsviral

లోకేష్ వారసత్వంపై లక్ష్మీ పార్వతి ఘాటు వ్యాఖ్యలు

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి నారా లోకేష్ వారసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న కడపలో జరిగిన మహానాడులో నారా లోకేష్‌ను ఎన్టీఆర్ వారసుడు అంటూ ప్రచారం చేశారని, అసలు లోకేష్ నందమూరి కాదు కదా అంటూ ప్రశ్నించారు. మన సంప్రదాయం ప్రకారం నందమూరి కుటుంబం నుండి వచ్చినవారినే ఎన్టీఆర్ వారసులుగా పరిగణిస్తాం అని పేర్కొన్నారు. నారా కుటుంబం నుండి వచ్చిన లోకేష్ ఎప్పటికీ ఎన్టీఆర్ వారసుడు కాలేడని, చంద్రబాబు అవినీతి రాజకీయాలకు మాత్రమే వారసుడవుతాడని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న లక్ష్మీ పార్వతి ‘రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, అఘాయిత్యాలకు లోకేష్‌ రచించిన రెడ్‌ బుక్‌ రాజ్యాంగమే కారణం. ఇలాంటి దగుల్బాజీ రాజకీయం చేసే వారు ప్రపంచంలో ఈ తండ్రీకొడుకులు తప్ప ఇంకొకరు ఉండరు’. అంటూ విమర్శలు కురిపిస్తూ వైసీపీ పార్టీ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.