Home Page SliderTelangana

మోదీ పర్యటనపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు నిజామాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మోదీ పర్యటనపై తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. “మా మూడు ప్రధాన హమీల సంగంతేంటి అని ప్రశ్నించారు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేది ఎప్పుడు? బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేది ఎప్పుడు అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు అని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. దాదాపు పదేళ్ల నుంచి పాతరేసి ఎంతకాలం ఈ అబద్ధాల జాతర కొనసాగిస్తారన్నారు. అసలు మీ మనస్సు కరిగేది ఎప్పుడు? తెలంగాణా గోస తీరేది ఎప్పుడు? మీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ని గుండెల్లో పెట్టుకున్న మీరు..తెలంగాణా గుండెల్లో మాత్రం గుణపాలు గుచ్చడం సరికాదన్నారు.మోదీ  తెలంగాణాలో కోచ్ ఫ్యాక్టరీ,ఉక్కు కర్మాగారం ప్రాణాలు తీశారన్నారు. అంతేకాకుండా తెలంగాణాలో లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఆర్‌ను మోదీ ఆగం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. పసుపు బోర్డు కూడా మహిళా రిజర్వేషన్ లాగానే ఉందనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాగా తెలంగాణాలో రాబోయే ఎన్నికల్లో మళ్లీ 100 చోట్ల మీ డిపాజిట్లు గల్లంతు అవడం ఖాయమని” కేటీఆర్ ట్వీట్ చేశారు.