ఫార్ములా ఈ-రేసు వ్యవహారంపై కేటీఆర్ క్వాష్ పిటిషన్
ఫార్ములా ఈ-రేసు వ్యవహారంపై కేటీఆర్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనపై నమోదు చేసిన ఏసీబీ కేసు క్వాష్ చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిని లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విషయంలో అసెంబ్లీలో కూడా చర్చ జరగాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. దీనిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే తాను ఈ రేస్ నిర్వహించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

