Home Page SliderTelangana

కాంగ్రెస్ సర్కార్‌కు కేటీఆర్ సవాల్

తెలంగాణాలో అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమకు ఉద్యోగం వచ్చిందని యువత చెబితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.కాగా రాష్ట్రంలో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఆయన మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాగా కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడో మాట,అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.