కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్
తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై విమర్శలు చేశారు. దేశంలో “అత్యున్నత రాజ్యాంగ పదవులు కేంద్ర ప్రభుత్వం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయని” కేటీఆర్ ధ్వజమెత్తారు. అయితే ఇటువంటి దుర్భర పరిస్థితిని బీజేపీయేతర రాష్ట్రాల్లో చూడవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకారం అందించకుండా ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. దేశం అభివృద్ది చెందడానికి ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం మోడల్ ,టీమ్ ఇండియా స్పిరిట్ సహాయపడుతుందా? అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో తెలంగాణా ప్రభుత్వం ఓ 10 రకాల బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం ఆమె ముందు ప్రవేశపెట్టింది. అయితే వాటిలో కేవలం 3 రకాల బిల్లులకు మాత్రమే తెలంగాణా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకొంది.

