NewsTelangana

నాడు హుజూరాబాద్… నేడు నల్గొండ- బాంబు పేల్చిన ఈటల

Share with

బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలోని ఒక ముఖ్య నేత తాము బీజేపీలోకి వచ్చేందుకు చూస్తున్నామని ఫోన్ చేశారన్నారు. ఫోన్ టాప్ చేస్తున్నారని తెలిసి కూడా… వారు వినాలనే చెబుతున్నానంటూ చెప్పారన్నారు ఈటల. కేసీఆర్ వెన్ను ఆయనకు కన్పించకున్నా… ప్రజలకు మాత్రం కనిపిస్తుందన్నారు. 8 ఏండ్ల కాలంలో ప్రజలకు బాధ వేస్తే ప్రగతిభవన్‌లో సెక్రటేరియేట్‌లో కలిసే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ సంకెళ్ళ మాటున ఉన్నావంటూ దుయ్యబట్టారు. హుజురాబాద్‌లో కేసీఆర్‌ను గుద్దు గుద్దితే ఎక్కడో పడ్డాడన్నారు. అప్పుడు ఆ భాగ్యం హుజురాబాద్‌కి దక్కిందన్నారు. మళ్ళీ ఆ అదృష్టం ఇప్పుడు నల్గొండకు దక్కబోతుందన్నారు. దళితుడ్ని సీఎం చేస్తానని మాట తప్పింది కేసీఆర్ అని… దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత మోదీదన్నారు. ఫారెస్ట్ అధికారుల కాళ్లపై గిరిజన బిడ్డలు పడాల్సిన దుస్థితి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. ఈ దుస్థితికి కారణమైన మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టె సమయం వచ్చిందన్నారు. ఆనాడు అన్ని పార్టీల నాయకులు తెలంగాణ కోసం ఎలా కదిలి వచ్చారో… ఇపుడు కేసీఆర్‌ను గద్దె దించడానికి అంతా ఎకమౌతున్నారని చెప్పారు ఈటల. ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి వస్తామంటున్నారని చెప్పారు ఈటల చెప్పారు. దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని… 20వ రాష్ట్రంగా తెలంగాణ కాబోతుందన్నారు.