రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన కోమటిరెడ్డి
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో ప్రజాస్వామిక, ప్రజానుకూల ప్రభుత్వ పాలన రాబోతోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం నాడు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న సోదరుడు రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయని తెలిపారు. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి నిర్ణయాలే పార్టీకి బలమని, ఇవే సిద్ధాంతాలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుని, అధిష్ఠానానికి తీర్మానం పంపారని ఆయన తెలిపారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన ఎక్స్ ఖాతా వేదికగా.. కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.


 
							 
							