Home Page SliderInternational

ఆద్యంతం ఆసక్తిగా సాగిన కోహ్లి శతకం…భారత్ ఖాతాలో నాలుగో విజయం

భారత్ టీమ్ వరుసగా నాలుగో విజయంతో ప్రపంచకప్‌కు చేరువవుతోంది. ఆద్యంతం  ఆసక్తిగా సాగిన సెంచరీతో కింగ్ కోహ్లి చెలరేగిపోయాడు. బంగ్లాదేశ్ పెట్టిన 257 పరుగుల టార్గెట్‌ను అవలీలగా దాటేశారు. మ్యాచ్ గెలిచేది పక్కా అయినప్పటికీ ప్రేక్షకులు కోహ్లి సెంచరీ కోసం ఆతృత పడ్డారు. కెప్టెన్ రోహిత్ 88 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఆ పునాది మీద అలవోకగా బ్యాటింగ్ చేసుకుంటూ బంగ్లాదేశ్‌ బౌలర్లకు ఛాన్స్ ఇవ్వలేదు కోహ్లి. ఊహించని విధంగా సెంచరీ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జట్టు స్కోరు 231 ఉండగా, కోహ్లి స్కోరు 74పరుగులుగా ఉంది. చేయవల్సిన పరుగులు తక్కువగానే ఉన్నాయి. కానీ కోహ్లికి సెంచరీ రావాలని అభిమానులు బలంగా కోరుకున్నారు. ఒకదశలో తోటి ఆటగాడు కే.ఎల్. రాహుల్ పరుగులు తీస్తుంటే చిరాకు పడ్డారు కూడా. కోహ్లికే బ్యాటింగ్ ఛాన్స్ రావాలంటూ ప్రార్థనలు చేశారు. రాహుల్ కూడా కోహ్లికి బాగా సపోర్టు చేస్తూ తనకు అవకాశం వచ్చినా పరుగులు తీయలేదు. దీనితో చిత్రంగా వికెట్ల మధ్య పరుగులు తీస్తూ పరుగుల వర్షం కురిపించారు. చివరికి గెలుపుకి రెండు పరుగులు మాత్రమే తీయవలసి ఉన్నా, భారీ సిక్స్ కొట్టి తనకు సెంచరీని సాధించుకున్నారు.