Andhra PradeshNews

అమిత్‌ షా- తారక్ భేటీపై కొడాలి నాని షాకింగ్ కామెంట్‌

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో టాలీవుడ్‌ అగ్రహీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ… రాజకీయ వ్యూహాల్లో భాగంగానే జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌ షా కలిసి ఉంటారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడానికి మోదీ, అమిత్‌ షా ఎన్నో వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని… ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌, అమిత్‌ షాల భేటీ జరిగి ఉండొచ్చని అన్నారు. RRR సినిమాతో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారని, ఆయన సేవలను దేశ వ్యాప్తంగా బీజేపీ ఉపయోగించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్‌ సినిమాలు బాగున్నాయని అభినందించడానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ను అమిత్‌ షా కలిశారని తాను భావించడం లేదని.. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని కొడాలి నాని పేర్కొన్నారు. తాజాగా నాని చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.