మీకు తెలియని రాముడు, శ్రీరామ చంద్రడు చరితం తెలుసుకోండి!
రాముడు గురించి ఎంత తెలిసినా.. ఎంత విన్నా తక్కువ. నిత్యం సత్యం పలికేవాడంటూ ఆయనను కవులు కీర్తించారు. విష్ణువు ఒక్కో అవతారం ద్వారా ఎన్నో అద్భుత ఘట్టాలను నిర్వర్తించాడు. జగదానంద కారకుడు.. జయ జానకీ ప్రాణనాయకుడు అవతారాల గురించి ఓసారి తెలుసుకుందాం… విష్ణువు మానవ అవతారంలో చేసిన లీలలు శ్రీరామ అవతరంలోనే మనకు దర్శనమిస్తాయి.

- విష్ణువు ఏడో అవతారం: శ్రీరాముడు 10 అవతారాలలో విష్ణువు ఏడో అవతారం. శ్రీరామునికి ముందు, విష్ణువు అవతారాలు మత్స్య , కూర్మ , వరాహ, నరసింహ, వామన, పరశురామ అవతారాల గురించి చెప్తారు. అయితే కృష్ణుడు, బుద్ధుడు, కల్కి అవతారాలు కూడా విష్ణు అవతరాల్లో భాగమేనంటారు.
- పురాతన మానవ దేవత: రాముడు త్రేతా యుగంలో జన్మించాడు. నేటికి 12, 96,000 సంవత్సరాల క్రితం త్రేతాయుగం ముగిసిందని విశ్వసిస్తారు. కాబట్టి, రాముడు మానవ రూపంలో పూజించే పురాతన దేవుడు. త్రేతాయుగంలో రాముడితో పాటు, విష్ణువు వామనుడిగా, పరశురాముడిగా అవతరించాడు.
- సూర్య భగవానుడి అంశ శ్రీరాముడు: శ్రీరాముడు “ఇక్ష్వాకు” వంశంలో జన్మించాడు. సూర్య భగవానుడి కుమారుడైన ” ఇక్ష్వాకు రాజు”చే స్థాపించబడింది. అందుకే రాముడిని “సూర్యవంశీ” అని అంటారు.
- విష్ణువు 394వ పేరు “రామ”: ఈ మాట చెప్పిన వెంటనే ఆశ్చర్యం కలుగుతుంది. విష్ణు సహస్రనామాల్లో విష్ణువు వెయ్యి పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం, “రామ” 394వ పేరు.
రామాయణము శ్రీ రామాయణము.. అడుగడుగున త్యాగము అణువణువున ధర్మాన్ని మానవాళికి అందించింది. ఇప్పుడు ఆ స్ఫూర్తితోనే అయోధ్య రాముడు రూపుదిద్దుకుంటున్నాడు. తరతరాల వారసత్వాన్ని తిరిగి మనకు అందించేందుకు దేశ వ్యాప్తంగా హిందుబంధుజనులు శ్రీరాముని చూసేందుకు చలో అయోధ్య అంటున్నారు.

- శ్రీరామ నామస్మరణ: రఘువంశీ గురువైన వశిష్ఠ మహర్షిచే శ్రీరామునికి నామకరణం చేశారు. “రామ” అనే పదం రెండు బీజాక్షరాలు “అగ్ని బీజ్” , “అమృత బీజ్”తో రూపొందించబడ్డాయి. ఈ అక్షరాలు మనస్సు, శరీరం, ఆత్మకు బలాన్ని అందిస్తాయి.
- మూడుసార్లు రామ నామాన్ని జపిస్తే వేలాది దేవుళ్లను కొలిచినట్టే: రామ నామాన్ని మూడుసార్లు పఠిస్తే వేయి దేవతల నామాలను ఉచ్చరించినంత అనుగ్రహం లభిస్తుందని శివుడు ఒకప్పుడు చెప్పినట్లు మహాభారతంలో ప్రస్తావన ఉంది. ధ్యానంలో శివుడు కూడా రాముడి పేరు జపించారంటే ఆశ్చర్యపోతారు. అందుకే జై శ్రీరామ్ అని నినదిద్దాం..
- ఒక్క యుద్ధంలో రాముడి ఓడాడు: అవును నిజం.. మీకు ఆశ్చర్యం కలగకమానదు. శ్రీరాముడు తాను యుద్ధంలో ఎలా ఓడాడో తెలుసుకుందాం… కాశీ రాజు “యయాతి”ని రక్షించడానికి హనుమంతుడు శ్రీరాముడితో యుద్ధం చేశాడు. ఋషి విక్రమాదిత్యుని ఆదేశానుసారం రాముడు కాశీ రాజును చంపడానికి వస్తాడు. యుద్ధంలో కాశీ రాజుకు సహాయం చేయడానికి, హనుమంతుడు శ్రీరాముని జపించడం మొదలుపెడతాడు. దీనివల్ల హనుమంతుడిపై శ్రీరాముడి బాణాల ప్రభావం ఉండదు. దీంతో రాముడు ఓటమిని అంగీకరిస్తాడు.
- రామసేతు నిర్మాణం, పొడవు: రామసేతు తమిళనాడులోని రామేశ్వరం నుండి శ్రీలంకలోని మన్నార్ వరకు వానర్ సేనచే నిర్మించబడింది. ఈ వంతెన నిర్మాణంలో ముఖ్యలు నలుడు, నీలుడు. ఈ వంతెన పొడవు దాదాపు 30 కి.మీ. దీనిని 6 రోజుల్లో నిర్మించారు.
యాంకర్
శ్రీరాముడు కష్టాలను ఇష్టాలుగా భావించాడు. పితృవాక్య పాలకుడిగా నీరాజనాలు అందుకున్నాడు. చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. కష్టాలను ఇష్టాలుగా భావించి, సీతమ్మకు కొంగుబంగారమయ్యాడు. ఈ ఆధునిక కాలంలోనూ శ్రీరామ నినాదమే మానవాళికి శ్రీరామరక్ష.

- శ్రీరాముని అపహరణ: రావణుని సోదరుడు అహిరావణుడు రాముడు, లక్ష్మణులను అపహరించి, మహామాయా దేవికి బలివ్వడానికి పాతాళానికి తీసుకెళ్లాడు. కానీ హనుమంతుడు అహిరావణుడిని చంపి రాముడు, లక్ష్మణుడిని విడిపిస్తాడు.
- 14 ఏళ్ల ప్రవాసం ప్రతీకారం: ఒక కథ ప్రకారం, రాముడు చిన్నగా ఉన్నప్పుడు, అనుకోకుండా తన బొమ్మతో మంథర వీపుపై కొడతాడు. ఈ సంఘటనతో కలత చెందిన మంధర తన పగ తీర్చుకోవడానికి కైకేయిని తన పావుగా ఉపయోగించుకుందంటారు. రాముడిని 14 సంవత్సరాల వనవాసానికి పంపడానికి కారణభూతురాలయ్యిందంటారు.
- శ్రీరామునికి ఉడత సాయం: లంక చేరుకోవడానికి, భార్యను రక్షించడానికి, శ్రీరాముడు సముద్రంలో వంతెనను నిర్మించవలసి వస్తుంది. చిన్న ఉడుత సాయం అందించాలని నిర్ణయించుకుంటుంది. నెమ్మదిగా కానీ కచ్చితంగా, ఇసుకను బ్రిడ్జిగా పేర్చుతుంది. ఈ దయతో రాముడు చలించిపోయి, ఉడుతను పైకి లేపి, ఆశీర్వదిస్తాడు. నాటి నుంచి తెలుపు-నలుపు చారలు వేలి గుర్తులుగా భావిస్తారు.
- శ్రీరాముని పాలన: రాముడు పదకొండు వేల సంవత్సరాలు అయోధ్య రాజ్యాన్ని పాలించాడు. ఈ స్వర్ణ కాలాన్ని “రామరాజ్యం” అంటారు.
- రాముడు సమాధి పొందడం: సీత భూమిలో కలిసిపోయిన తర్వాత తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, రాముడు సరయూ నదిలో అంతర్థానమవుతాడు.

అయోధ్య మూడక్షరాలు.. శ్రీరామ్.. మూడక్షరాల జీవనాడి.. ఇప్పుడు వంద కోట్ల మంది హిందువుల ఆరాధ్యదైవం కొలువ కాబోతున్న అయోధ్యకు ఇప్పుడు భక్తజన కోటి పొటెత్తుతోంది. అయోధ్య పేరు వింటేనే భక్తకోటి పులకించిపోతోంది. దేశానికి ఆగస్టు 15న 1947లో స్వాతంత్ర్యం సిద్ధిస్తే.. శ్రీరాముడికి తాను పుట్టిన అయోధ్యలో ఆలయాన్ని ఇన్నాళ్లకు సమకూర్చుకోగలిగారు. ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే’ ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం సిద్ధిస్తుందంటారు. శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందంటారు. అందుకే జై శ్రీరామ్ అంటూ నినదిద్దాం… నమస్కారం…

