వైసీపీకి కీలక నేతలు ఝలక్..ఎమ్మెల్సీ రాజీనామా
ఏపీలో వైసీపీ పార్టీకి కీలక నేతలే ఝలక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలువురు రాజ్యసభ ఎంపీలు, కీలక నేతలు వైసీపీ పార్టీని వీడడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే కొందరు పార్టీ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా పత్రాలు ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు. వీరంతా వైసీపీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలలో చేరే అవకాశమున్నట్లు సమాచారం. వీరితో పాటు పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ సభ్యత్వంతో పాటు పదవికి కూడా రాజీనామా చేశారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని తెలియజేశారు.

