Home Page SliderTelangana

కేసీఆర్ కోసం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కేసీఆర్ తుంటి సమస్యలతో సోమాజిగూడా యశోదా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఆరోగ్యం కోసం, తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయన చికిత్స తీసుకుంటున్న యశోదా ఆస్పత్రి వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో వారు ఆ హాస్పటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద పడిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. తుంటి ఫ్రాక్చర్‌తో బాధపడి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. శస్త్రచికిత్స అవసరమని తేల్చారు.