ఏపీలో ఆరోగ్యశ్రీలో కీలక మార్పులు
ఏపీలో ఆరోగ్యశ్రీలో కీలక మార్పులు చేశారు. ఇప్పటివరకూ ట్రస్టు విధానంలో కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ సేవలను ఇకపై బీమా పరిధిలోకి తీసుకురానున్నారు. ఏపీ ఆరోగ్యమంత్రి సత్యకుమార్ ఆదేశాలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రోగులకు అందించిన చికిత్సకు తగినట్లుగా ఆసుపత్రులకు ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తోంది. దీనివల్ల ఒక్కొక్కసారి బకాయిలు ఎక్కువయిపోయి, పేరుకుపోతున్నాయి. బీమా విధానంలో హెల్త్ కార్డులు ఉన్నవారు దేశవ్యాప్తంగా ఉచిత చికిత్స పొందే అవకాశం ఉంటుందట. దీనితో ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు వైద్యసేవలు దేశవ్యాప్తంగా ఉచిత సేవలు పొందే అవకాశం ఉంది.

