బీఎస్పీకి కేసీఆర్ బంపర్ ఆఫర్ హైదరాబాద్, నాగర్‌కర్నూల్ సీట్లు కేటాయింపు
రాజకీయాల్లో బళ్లు ఓడలు, ఓడలు బళ్లవుతుంటాయి. కేసీఆర్ ఉద్యమ సమయంలో డక్కామక్కీలు తిన్నారు. ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ విజేతగా నిలిచారు. అంతే కాదు పదేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత సీన్ మారిపోతోంది. మొన్నటి వరకు పొత్తుల గురించి లెక్కలేనట్టుగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రంలో అంతగా పలుకుబడి లేని బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. అంతే కాదు ఆ పార్టీకి నాగర్ కర్నూలు, హైదరాబాద్ ఎంపీ స్థానాలను కేటాయించారు. నాగర్ కర్నూల్ బీఎస్పీకి కేటాయిస్తారని మొదట్నుంచి వార్తలు వచ్చినా తాగాజా హైదరాబాద్ కేటాయించడం వెనుక మజ్లిస్ అధినేత అసద్ కు ఎన్నికల్లో లబ్ధి కలిగించే ఆలోచన ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

