కొండగట్టు అంజన్నకు కేసీఆర్ ప్రత్యేక పూజలు
తెలంగాణ సీఎం కేసీఆర్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కొండగట్టుకు చేరుకున్న కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎంతోపాటు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, సుంకె రవిశంకర్ ఉన్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవలే కొండగట్టు ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ 100 కోట్లు కేటాయించారు. క్షేత్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివిధ అభివృద్ధి పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

