NewsNews AlertTelangana

స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్న కేసీఆర్

Share with

రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , తలసాని శ్రీనివాస్ యాదవ్ , శ్రీనివాస్ గౌడ్ , సబితా ఇంద్రారెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి , సీఎస్ , డీజీపీ నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ సమైక్యతా, దేశభక్తిని పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు చెపట్టనున్నట్టు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలో ఇంటింటికీ పంపిణీ చేసేందుకు ఇప్పటికే కోటి జెండాలు సిద్ధం చేసామని , వాటిని అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో జెండాలు పంపిణీ చేసేలా చూడాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసామన్నారు. 

ఆగస్టు 8వ తేదీన జరిగే ప్రారంభోత్సవ సభకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్టు సమాచారమిచ్చారు. అదే విధంగా దేశభక్తిని పెంపొందించే చలన చిత్రాలను , జాతీయ సమైక్యతను విద్యార్థులకు తెలియపరిచేలా అన్ని సినిమా థియేటర్లలో ఉచితంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమీక్షకు కమిటీ ఛైర్మన్ కె కేశవరావుతో సహా 24 మంది సభ్యులు హాజరయ్యారు.