కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నాడు..రేవంత్ రెడ్డి
మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 61మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఆయన పార్టీలోకి లాక్కున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించేదే కేసీఆర్. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నెలరోజులలోనే కూలిపోతుందని కేటీఆర్, హరీశ్ శాపనార్థాలు పెట్టారు. కేసీఆర్‌కు ఇప్పటికీ కనువిప్పు కలుగలేదు. కాంగ్రెస్‌ను ఓడించడానికి బీజేపీతో జట్టుకట్టారు. మెదక్‌కు కంచుకోటగా చెప్పుకునే బీఆర్‌ఎస్ మూడవస్థానానికి వచ్చిందంటే బీజేపీతో కుమ్మక్కు కావడమే కారణం. సిరిసిల్ల, సిద్దిపేటలో కూడా బీజేపీకి అన్ని ఓట్లు వచ్చేవి కాదు. రాష్ట్రావతరణ దినోత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించినా రాలేదు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కోరింది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డే. అందుకే విచారణ కమిషన్ కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రావతరణ దినోత్సవంలో విపక్షనేత మాట్లడే అవకాశం ఎప్పుడూ లేదు. మాకు గతంలో ఆహ్వానం కూడా లేదని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

