Home Page SliderTelangana

తెలంగాణా ప్రజలను ఆదుకోవడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది:రేవంత్ రెడ్డి

తెలంగాణా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే ఆయన మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసి..వార్తల్లో నిలిచారు. కాగా తెలంగాణా వ్యాప్తంగా వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. దీని గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వారం రోజులు నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అల్లాడుతున్నారు. అయితే ఈ సమయంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదన్నారు. కాగా తన పుట్టినరోజు మోజులో పడి కేటీఆర్ ప్రజలను  మర్చిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఈ భారీ వర్షాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయితే హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ విశ్వనగరంగా అభివర్ణిస్తూ నరకకూపంగా మార్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.