Andhra PradeshNews

కుప్పంలో చంద్రబాబుతో పోటీ… కౌంటర్ ఇచ్చిన హీరో విశాల్

Share with

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై హీరో విశాల్ పోటీ చేస్తారంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయ్. చంద్రబాబును ఢీకొట్టేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాల్ రెడ్డిని రంగంలోకి దించుతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను వైసీపీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోసిపుచ్చారు. చంద్రబాబుపై పోటీకి ఇప్పటికే క్యాండిడేట్ ఖరారయ్యారన్నారు…

ఐతే తాజాగా కుప్పంలో చంద్రబాబుపై పోటీకి సంబంధించి హీరో విశాల్ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి.. కుప్పం నుంచి పోటీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని.. వాటిని ఖండిస్తున్నానని ప్రకటించారు. రాజకీయాలకు సంబంధించి ఎవరూ కూడా తను కలవలేదన్నారు విశాల్. కొందరు ఎందుకు ఇలా వార్తలను ప్రచారం చేస్తారో తెలియదన్నారు. సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నానన్న విశాల్… అసలు ఏపీ పాలిటిక్స్‌లోకి రావాలని… చంద్రబాబుపై పోటీ చేయాలని అస్సలు భావించడం లేదన్నారు.