Home Page SliderNational

కోర్టులో కవితకు మళ్లీ చుక్కెదురు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో శిక్షననుభవిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను నేడు కూడా కోర్టులో చుక్కెదురయ్యింది. ఆమెకు డిఫాల్ట్ బెయిల్ వచ్చే విషయంలో దాఖలు చేసిన పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారించింది. సీబీఐ కేసులో విచారణ ఖైదీగా ఉన్న ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురయ్యి ఆసుపత్రిలో కూడా చేరడంతో ఆమెకు బెయిల్ మంజూరు చేయవలసిందిగా పిటిషన్ వేశారు. అయితే రౌస్ అవెన్యూ కోర్టు  ఈ విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. దీనితో ఆమెకు ఊరట లభించలేదు.