బొమ్మరిల్లు చిత్రాన్ని కాపీ కొట్టిన కరణ్ జోహార్
బాలీవుడ్‌లో పేరుపొందిన డైరక్టర్ కరణ్ జోహార్ దాదాపు పద్దెనిమిదేళ్ల క్రిందట వచ్చిన తెలుగు చిత్రమైన బొమ్మరిల్లు కాన్సెప్ట్‌ను కాపీ కొట్టాడంటూ విమర్శలు వస్తున్నాయి. అంత గొప్ప డైరక్టర్‌కు ఇవేం బుద్దులంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. విషయమేమిటంటే కరణ్ కొత్తగా నిర్మించిన ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కథ’ చిత్రం ట్రైలర్ రిలీజయ్యింది. దీనిని బట్టి ఈ చిత్రంలో కూడా అచ్చం బొమ్మరిల్లులాగానే హీరోహీరోయిన్ల ప్రేమ ఫలించాలంటే వారు ఒకరింట్లో ఒకరు మూడు నెలలు ఉండాల్సి వస్తుందట. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. జయాబచ్చన్, ధర్మేంద్రలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక చిత్రం యొక్క పూర్తి విశేషాలు తెలియాలంటే జూలై 28 రిలీజ్ రోజు వరకూ ఆగాల్సిందే.

