కరాచీ బేకరి పేరును వెంటనే మార్చాలి
ఏపీలోని విశాఖపట్నం వెంకోజిపాలెంలో కరాచీ బేకరి ఎదుట జన జాగరణ సమితి ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. పాకిస్తాన్‌కి చెందిన కరాచీ పేరును పెట్టడం ఎంతవరకు సబబు అంటూ ఆందోళన చేశారు. తక్షణమే కరాచీ బేకరి పేరు మార్చాలి.. లేదంటే కేంద్రం వీళ్ళ మీద దేశ ద్రోహం కేసు పెట్టాలని జనజాగరణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. వందేమాతరం.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బేకరీ వద్దకు చేరి వారిని అక్కడి నుంచి తరలించారు.

