Home Page SliderNational

వరకట్న వేధింపుల కేసులో కన్నడ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష

వరకట్న వేధింపుల కేసులో కన్నడ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. అభినయ కోడలు లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. 2002లో చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. నటి సోదరుడు శ్రీనివాస్‌తో 1998లో వివాహమైనప్పుడు లక్ష్మీదేవి కుటుంబం రూ.80,000 నగదు, 250 గ్రాముల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చిందని, మరో లక్ష రూపాయల కట్నం కోసం లక్ష్మీదేవి వేధించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. లక్ష్మీదేవి తన అత్తమామల ఇంట్లో ఎడతెగని వేధింపులకు గురవుతున్నందున కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉన్నానని తెలిపింది.

కుటుంబసభ్యులు భారీగా కట్నం ఇచ్చినా, ఎక్కువ డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారని గుర్తుచేసుకుంది. వారి డిమాండ్లను తిరస్కరించడంతో, అభినయ తనను హత్య చేస్తానని బెదిరించిందని ఆమె ఆరోపించింది. లక్ష్మీదేవిని తల్లి ఇంటికి పంపించారు. ఆమె భయంకరమైన పరిస్థితులను వివరిస్తూ తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. కోర్టు నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసింది. అయితే అత్తమామలను కటకటాల వెనక్కి పంపడం అంత వీజీగా అవలేదంది. అభినయ, ఆమె భర్త బంధువులు ఆమెను బలవంతంగా కేసును ఉపసంహరించుకులేనా చేశారంది. చిత్రహింసలు, బెదిరింపులకు గురిచేసినా లక్ష్మి అధైర్యపడలేదు. ఈ కేసులో విజయం సాధించాలని పట్టుదలతో వ్యవహరించింది.

కేసులో ఐదుగురు నిందితులు అభినయ, ఆమె తండ్రి రామకృష్ణ, సోదరుడు శ్రీనివాస్, తల్లి జయమ్మ, సోదరుడు చెలువ 2012లో మెజిస్ట్రేట్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నిర్ణయం పట్ల లక్ష్మి సంతోషం వ్యక్తం చేసినా జిల్లా కోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేయడం ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించుకుంది. చివరికి మేజిస్ట్రేట్ కోర్టు ఆ తీర్పును సమర్థించింది. ఈ కేసు విచారణ సమయంలో రామకృష్ణ, శ్రీనివాస్ మృతి చెందారు. అభినయ, జయమ్మ, చెలువలకు జైలు శిక్ష ఖరారయ్యింది.