అమిత్‌షాపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు
అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ పరోక్షంగా స్పందించారు. అంబేద్కర్ ఆలోచనా పునాదుల మీదే నవ భారత నిర్మాణం జరిగిందని కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీయుల అణచివేత నుండి గాంధీజీ మనకు విముక్తి కల్పించారని, తర్వాత కాలంలో సామాజిక అన్యాయాల నుండి అంబేద్కర్ విముక్తి కల్పించారని పేర్కొన్నారు. స్వేచ్ఛా భారతావని కోసం అంబేద్కర్ విముక్తి కల్పించారని పేర్కొన్నారు. ఆయన వారసత్వాన్ని హననం చేసే చర్యలను తాను అంగీకరించబోయేది లేదని, అమిత్ షా పై వ్యాఖ్యానించారు.

