Home Page SliderTelangana

రేపు కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి

 మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఆయన కాంగ్రెస్‌లో చేరతానని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు తాజాగా ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు రేపు ఉదయం 9:30 గంటలకు జాపల్లి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జూపల్లితో సహ పలువురు నేతలు ఢిల్లీ చేరుకున్నారు. కాగా వారంతా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అయితే మల్లి ఖార్జున ఖర్గే బిజీ షెడ్యూల్,ఇతర కారణాలతో జూపల్లి కాంగ్రెస్‌లోకి చేరే కార్యక్రమం వాయిదా పడినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.