InternationalNews

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ప్రస్ధానం

Share with

జపాన్ మాజీ ప్రధాని షంజో అబే మరణం మెత్తం ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. జపాన్‌లోనే అతి చిన్న వయసులో ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా అబే చరిత్ర సృష్టించారు. అంతేకాక ఎక్కువ కాలం ప్రధానిగా బధ్యతలు అందించిన వ్యక్తి అబే. ఆయన రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవమున్న కుటుంబం నుండి వచ్చారు. జపాన్‌ను ప్రపంచంలోనే అత్యధిక బలమైన ఆర్ధికవ్యవస్ధగా , రాజకీయ స్ధిరత్వంగలిగిన దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దారు.ఈయన జపాన్ రాజధాని అయిన టోక్యోలో 1945 సెప్టెంబర్ 21న జన్మించారు. జపాన్ విదేశాంగమంత్రిగా పనిచేసిన షింతారో అబెకుమారుడే షింజో…. అంతేకాక జపాన్ మాజీ ప్రధాని, నొబుసుకె కిషి మనవడు. షింజో టోక్యోలోని సెయికీ యూనివర్సిటిలో పొలిటికల్ డిగ్రీ పూర్తిచేశారు.అనంతరం అమెరికా వెళ్లి యూనివర్సిటి ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో పబ్లిక్ పాలసీని 1977లో పూర్తీచేశారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన రెండు సంవత్సరాల తర్వాత అబే కోబే స్టీల్లో తన ఉద్యోగ జీవితాన్ని మెదలుపెట్టారు. అధికార లిబరల్ డెమెుక్రటిక్ పార్టీలోవిదేశాంగ మంత్రిత్వశాఖలో బాధ్యతలు చేపట్టారు.. ప్రత్యేక రాజకీయల్లోకి అడుగు పెట్టిన అబె…ఎల్‌డిపి తరపున యమగుచి నుంచిఎన్నికయ్యరు.

జునిచిరో కొయిజుమీ ప్రధానిగా ఉన్న సమయంలో చిీఫ్ కేబినేట్ సెక్రటరీగా నియమించబడ్డారు. ఆ సమయంలోఉత్తర కొరియాలో అపహరణకు గురైన జపాన్ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి అబే నేతృత్వం వహించారు. 2005లో ఎల్‌‌డీపి అధినేతగా షంజో ఎన్నికయ్యరు. దీంతో తదుపరి ప్రధానిగా బాధ్యతలునిర్వహంచేందుకు మార్గం సులభమైంది…….26 సెప్టెంబర్ 2006 ప్రధానిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన మంత్రి బాధ్యతలు స్వీకరించినకొద్ది రోజుల్లోనే ఎల్‌డీపికి ప్రజలలో వ్యతిరేకత ఎదురైంది. ఆ సమయంలోనే పెద్ద ప్రేగులో ఎదో సమస్య కారణంగా షింజో ఆరోగ్యం క్షీణంచి తాను తన పదవికి రాజీనామా చేశారు. 2012 లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ప్రధానమంత్రిగా ఎంపికయ్యరు. ఈ సారి ఆయన పాలనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అబెనామిక్స్ పేరుతో షింజో చేసిన ఆర్ధిక సంస్కరణలు జపాన్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయి. అబే అధికారంలో ఉన్న సమయంలోనే చైనాతో జపాన్‌కు సంబంధాలు మెరుగుపడ్డాయి. దీని ద్వారా అబే 2014 ఎన్నికల్లో మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ దఫాలో పలు సదస్సులు నిర్వహించి అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌‌తో సన్నిహిత సంబంధాలుకొనసాగించారు. అ సమయంలో మళ్లీ అబే పెద్ద ప్రేగు సమస్య తీరగబెట్టడంతో ఆయన తన పదవినుండి తప్పుకుంటున్నట్టు తెలిపారు. జపాన్ చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు సేవలందించిన నేతగా రికార్డు సృష్టించారు. కీలక బాధ్యతల్లో లేనప్పటికి తైలన్‌తో దాడికి దిగుతామన్న చైనాపై షింజో మండిపడ్డారు… అ ప్రస్తావనపై అబే చైనాను వ్యతీరేకిస్తూ, హెచ్చరిస్తునే ఉన్నారు. జూలై 8 న జరిగినఎన్నికల ప్రచారంలో ఉన్న షింజోపై గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచేందారు.

జపాన్లో భద్రత వ్యవస్ధ చాలా పటిష్టంగా ఉంటుంది. 12.5 కోట్ల జనాభ ఉన్న జపాన్‌లో 2019 నుండి ఇప్పటిదాకా తుపాకీ సంబంధిత కేసులు 10 మాత్రమే. జపాన్‌లో గన్ చూసిన వాళ్లు కూడా తక్కవగా ఉంటారు. భద్రత సిబ్బంది కూడ తుపాకీని అత్యవసర పరిస్ధితిలో మాత్రమే ఉపయోగిస్తుంటారు. అక్కడ చట్టం ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. ఎ వక్తికైన లైసెన్సు గన్ కావాలంటేముందుగా అక్కడి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తుకి అప్లై చేసుకునే అభ్యర్ధికి తగిన వయస్సుంటే మాత్రమే తనని తదుపరి ప్రాసెస్‌కు అనుమతిస్తారు. ఈ ప్రాసెస్‌లో భాగంగా ఎంపికైన అభ్యర్ధులకు ఓ పరీక్ష నిర్వహిస్తారు. దానిలో పాసైనవారికి షూటింగ్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్‌లో 95శాతం షూటింగ్ కరెక్ట్‌గా చేసిన వారికి మాత్రమే మిగతా ప్రాసెస్‌కు అనుమతిస్తారు.ఇలా మెత్తంగా 13కి పైగా పరిక్షలు నిర్వహిస్తారు. ఇంత భద్రతలో కూడా ఎంతో మంది ప్రముఖులుఇలా కాల్పులకి గురౌతూనే ఉన్నారు. షింజో అబే కూడా అలాంటి సంఘటనలో మృతి చెందారు. కాల్పులు జరిగిన దుండగుడు తన తుపాకిని స్వయంగా తయారు చేసినట్టు… తూటాకి బదులుగా గన్ పౌడర్‌ని వాడాడని అక్కడి సిబ్బంది తెలిపారు. షంజోని కాల్చిన వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియానుండి తొలగించారు.