Home Page SliderInternational

భారీగా నష్టపరిహారాన్ని చెల్లించనున్న జాన్సన్ & జాన్సన్

జాన్సన్ & జాన్సన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు సంబంధించిన అనేక రకాల ప్రొడక్ట్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. కాగా  జాన్సన్ & జాన్సన్ కంపెనీ ఉత్పత్తి చేసే బేబి పౌడర్‌పై అమెరికాలో 40 వేల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులన్నింటికి సంబంధించి ఆ కంపెనీ సెటిల్‌మెంట్ ప్రకటన చేసింది. దీని ప్రకారం ఈ కంపెనీపై నమోదైన కేసులన్నింటికి నష్ట పరిహారంగా $9 బిలియన్ డాలర్లు చెల్లిస్తామని దివాళ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కంపెనీ పేర్కొంది. కాగా ఈ కంపెనీ ఉత్పత్తి చేసే బేబి టాల్కమ్ పౌడర్‌లో క్యాన్సర్‌కు కారణమైన అస్‌బెస్టాస్ ఉన్నట్లు పలు ఆరోపణలు వచ్చాయి.అయితే దీనిపై విచారణ జరిపిన అమెరికా ప్రభుత్వం ఆరోపణలు వాస్తవమేనని నిర్థారించింది. దీంతో 2020 నుంచి బేబి టాల్కమ్ పౌడర్ అమ్మకాలను జాన్సన్ & జాన్సన్ కంపెనీ నిలిపివేసింది.