సై అంటే సై.. స్పీకర్ అపాయింట్మెంట్ కోరిన రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందుకు తగినట్టుగానే అడుగులు వేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సత్తా చాటాలని డిసైడైనట్టుగా కన్పిస్తున్నారు. అందులో భాగంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోమటిరెడ్డి అపాయింట్మెంట్ అడిగారు. ఈ నెల 8, లేదా 9 తేదీన స్పీకర్‌కు ఎమ్మెల్యే రాజీనామా లేఖను ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. రేపు ఢిల్లీకి వెళ్లి… మొత్తం వ్యవహారంపై బీజేపీ పెద్దలకు వివరించాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు.
ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి.. పార్టీని ఎలా సమాయాత్తం చేయాలన్నదానిపై పార్టీ పెద్దల సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.
Read more: జగన్ దెబ్బకు.. చంద్రబాబు ఔటేనా ?