జగన్ ప్రభుత్వం దగా చేసింది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
జగన్ ప్రభుత్వం ప్రజల్ని దగా చేసిందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు పెన్షన్లు అందజేస్తున్నారన్నారు. పేదవాడికి అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే, జగన్ వాటిని రద్దు చేశారని మండిపడ్డారు. గంజాయి లాంటి మహమ్మారిని రాష్ట్రం నుండి తరిమికొడతామన్నారు. మంచి పరిపాలన ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.

