Andhra PradeshHome Page Slider

సీపీఐ నారాయణ సూపర్ లాజిక్కు..!

కేజ్రీవాల్ అరెస్ట్ కేంద్రంలో బీజేపీకి ప్రతికూలంగా మారిందన్నారు సీపీఐ నేత కె నారాయణ. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయడంతో బీజేపీ భారీగా దెబ్బతింటుందన్నారు. 400 సీట్లంటూ మోదీ మైండ్ గేమ్ దెబ్బతింటుందన్నారు. ఉత్తర భారతదేశంలో 50 శాతం ఓడిపోతున్నారన్నారు. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానాలో సగానికి పైగా ఓడుతున్నారన్నారు. దక్షిణాదిపై బీజేపీ ఆశలు పెట్టుకుందని, ఐతే ఏపీలో చంద్రబాబు దయ వల్ల ఒకట్రెండు సీట్లు వస్తాయన్నారు. మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి తధ్యమన్నారు. మోదీ స్పీచ్‌ల సరళి చూస్తే అది అర్థమవుతుందన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లఘించినవారు ప్రధాని, హోం మంత్రి అన్నారు. రాజకీయ కక్షతో చర్యలు తీసుకుంటున్నారన్నారు. కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం జైల్లో ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి రూ. 45 వేల కోట్ల అవినీతిపరుడ్ని ఐదేళ్లు మోసారని, కానీ ఐదేళ్లు వదిలేశారని, ఇప్పుడు మాత్రమే జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడిస్తారన్నారు నారాయణ. మధ్యవయస్కులు, యువతకు కసి పెరిగిందన్నారు. బయట దేశాల నుంచి వచ్చి మరీ ఎన్నికల్లో ప్రచారం చేశారన్నారు. ఏపీలో అందరూ కసిగా వచ్చి ఓటేశారన్నారు. జగన్ పై ప్రజల్లో కసి ఉందన్నారు. ప్రమాణస్వీకారం నుంచి జగన్ విధ్వంసం చేశారన్నారు. చంద్రబాబు చేసిన పనులను కంప్లీట్ చేసి ఉంటే మళ్లీ గెలిచి ఉండేవారన్నారు. అభివృద్ధి సాధ్యమయ్యేదన్నారు. ఏపీలో అవినీతి ఉందని ప్రధానే చెప్పారన్నారు.