దళిత క్రిస్టియన్లకు జగన్ గిఫ్ట్
అనాదిగా అట్దడుగు వర్గాల వారికి అన్యాయం జరుగుతూనే ఉంది. దళితులను ఉద్దరించే పథకాలు ఎన్ని వస్తున్నా వారికి సరిగా చేరలేదనే చెప్పాలి. అందుకే వీరికి లాభం చేకూర్చే మరొక అడుగు వేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. దళితుడు మరొక మతంలోకి మారినా సరే వారికి ఎస్సీ రిజర్వేషన్ హక్కులకు భంగం కలుగబోదని ప్రకటించారు ఏపీ సీఎం జగన్. నేడు అసెంబ్లీలో కీలకమైన రెండు తీర్మానాలు చేశారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లోకి చేర్చాలనేదే ఈ తీర్మానం.. ఎస్సీలు మతం మారినా వారి పరిస్థితుల్లో మార్పు రాలేదని, వారికి రావల్సిన రిజర్వేషన్‌ను ఆపడం అన్యాయమని జగన్ వ్యాఖ్యానించారు. అలాగే బోయ,వాల్మీకులను కూడా ఎస్టీల్లో చేర్చాలని మరొక బిల్లును కూడా ప్రవేశపెట్టారు. దీనిని పార్లమెంటుకు పంపుతామని, అనంతరం చట్టంగా మారే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

