సొంత నియోజకవర్గంలో జగన్ కు బిగ్ షాక్..
సొంత నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. పులివెందులలో వైసీపీ కౌన్సిలర్, కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో 30వ డివిజన్ కౌన్సిలర్ సాహిదాతో పాటు 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారందరికీ బీటెక్ రవి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో వైసీపీ కేడర్ అయోమయంలో పడిపోయింది.


 
							 
							