జగన్‌కి పాస్ పోర్ట్ ఇస్తారా,లేదా?
ఏపి సీఎం వైఎస్ జగన్‌కి పాస్ పోర్ట్ సమస్య వచ్చింది. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటీషన్ కూడా వేశారు. లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవం కార్యక్రమం కోసం ఈ నెల 3 నుంచి 25 వరకు లండన్ వెళ్లాల్సి ఉంది.ఈ విషయాన్ని ఆయన పాస్ పోర్టు కార్యాలయానికి సమాచారం అందించారు. దాని కోసం తప్పనిసరిగా NOC ఇవ్వాలని పాస్ పోర్టు కార్యాలయం జగన్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆయన పాస్ పోర్టుకు NOC ఇచ్చేలా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించాలని హైకోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.దీంతో జగన్‌కి పాస్ పోర్టు ఇస్తారా లేదా అన్నది సందిగ్దంగా మారింది.

