జగన్ మూర్ఖత్వం వీడాలి.. అమరావతిని రాజధానిగా ప్రకటించాలి: సీపీఐ రామకృష్ణ
అమరావతి: అమరావతి రాజధాని ఉద్యమం 1400 రోజులకు చేరిన సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందనలు తెలియజేశారు. అమరావతి రాజధాని రైతుల, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. కోర్టులను కూడా లెక్కచేయకుండా సీఎం జగన్ రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేయడం తగదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మూర్ఖత్వం విడనాడి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మార్గదర్శిపై సీఐడీ మరోసారి తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

