Andhra PradeshNews

జగన్ ఇక సద్దుకో…? ఏపీలో కొత్త సర్కార్

Share with

జగన్ పైకి ఉమ్మడిగా దండెత్తబోతున్నారా ?.. ఏపీ రాజకీయ ముఖచిత్రంలో మార్పులు

మనసులు మారుతున్నాయా? పాత స్నేహాలు నెమరేసుకుంటున్నారా? కొత్త సమీకరణాలకు సరికొత్తగా తెర లేస్తోందా? ఉమ్మడి శత్రువుపైకి కలిసికట్టుగా దండెత్తబోతున్నారా? ఏపీ రాజకీయ ముఖచిత్రంలో మార్పులకు ఈ కలయికలు సంకేతామా.? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది అందరికీ తెలిసిందే.. ఈ మధ్య అందరూ చూస్తోందే. ఏపీలో అదే సీన్ మళ్లీ రిపీట్ కాబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ చేతిలో కకావికలమైన విపక్షాలు అన్ని ఒకే గూటికి చేరే ఆలోచన చేస్తున్నాయా? అనే విధంగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్‌ను ఢీ కొట్టేందుకు అందరూ ఏకం కావాల్సిన అజెండాను ప్రతిపక్షాలు సీరియస్‌గా పరిశీలిస్తున్నాయా? మొత్తం సిచ్యువేషన్ చూస్తే అలాగే అనిపిస్తోంది.

2019 ఎన్నికల్లో వైసీపీ స్వింగ్‌.. మిగతా పక్షాలు చిత్తు!

2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. టీడీపీ, బీజేపీలతో తెగదెంపులు చేసుకున్న జనసేన.. లెఫ్ట్‌తో కలిసి పోటీ చేసింది. జనసేనతో పొత్తు పెట్టుకోవాలని పార్టీలో అంతర్గతంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోని జగన్ సోలోగా ఎన్నికలు వెళ్లి సింగిల్ హ్యాండ్‌తో విక్టరీ కొట్టేశారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 23 సీట్లకు పరిమితం అయితే… బీజేపీ, వామపక్షాలు జీరో అయ్యాయి. జనసేన సచ్చీచెడీ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. వైసీపీ స్వింగ్‌లో విపక్షాలు చిత్తుచిత్తు అయ్యాయి.

సీఎం జగన్‌ను ఢీకొట్టడానికి విపక్షాలను టీడీపీ ఏకం చేస్తుందా?

ఏపీలో సీఎం జగన్ స్పీడ్ మీద ఉన్నారు. లక్ష కోట్ల రూపాయలు పైగా వివిధ పథకాల పేరుతో నేరుగా జనానికి చేర్చిన జగన్.. పార్టీ పునాదులను పటిష్టం చేసుకుంటున్నారు. జగన్ ఢీకొట్టడానికి ప్రతిపక్షాలను ఏకం చేయడం టీడీపీకి వెన్నతోపెట్టిన విద్య. ఈ విషయంలో ఆ పార్టీకి విశేషమైన అనుభవం ఉంది. 2004లో కాంగ్రెస్ తో కలిసిన టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలను 2009కి వచ్చేసరికి తనవైపు తిప్పుకుని మహాకూటమి కట్టారు చంద్రబాబు.

లెఫ్ట్‌ పార్టీలకు మిగిలింది టీడీపీయేనా?

జనసేన దూరం కావడంవల్ల గత ఎన్నికల్లో దాదాపు 30 సీట్లలో ఓడిపోయామనే లెక్కలు టీడీపీ వేసుకుంది. ఆ పార్టీ దూరం కావడంవల్ల జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ ఈసారి జనసేనతో జతకట్టి ఎన్నికలకు పోవాలనే తలంపుతో ఉన్నది. జనసేన బీజేపీతో పొత్తులో ఉన్నా…. ఆ రెండు పార్టీలు ఎక్కడా కలిసి పెద్ద కార్యక్రమాలు చేసిందిలేదు. లెఫ్ట్ పార్టీలలో సీపీఐ చూపు టీడీపీవైపు ఉంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టీడీపీకి మొదటి నుంచి సానుకూలం అనే ముద్ర ఉంది. ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఎలా ఉన్నా… ఆచితూచి…. సుదీర్ఘమైన… లోతైన విశ్లేషణ తర్వాత నిర్ణయం తీసుకునే సిపిఎం కూడా ఈ జట్టులో కలుస్తుందా? అనేది చూడాలి. విభజిత రాష్ట్రంలో వామపక్షాలు ఉనికి నిరూపించుకోలేకపోయాయి. టీడీపీలాంటి పెద్ద పార్టీలతో కలిస్తే రెండో మూడో సీట్లు వస్తే చాలు అనుకునే పరిస్థితి ఆ పార్టీలది. జనసేనతో కలిసి వైసీపీ, టీడీపీలకు గట్టి ప్రత్యామ్నయం ఏర్పాటు చేయాలన్న కమ్యూనిస్టుల ఆశలపై పవన్ నీళ్లు చల్లారు. ఆ పార్టీలను అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ పార్టీలకు మిగిలింది టీడీపీనే లేదంటే… ఒంటరి పోరే.

మిగిలిన విపక్షాల ఆలోచన అదే అయితే ఏపీలో కొత్త సమీకరణాలు?

అధికారం పోయిన తర్వాత తిరిగి అధికారంలోకి రావడానికి విపక్షాలను ఏకం చేయడం టీడీపీకి అలవాటే. ఈసారీ ఇదే కోవలో ఆ పార్టీ ఆలోచన చేస్తే…. మిగిలిన పార్టీలు కూడా ఆ కోవలో నడిస్తే… ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలు మొదలైనట్టే. అయితే ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలు సమయం ఉంది. ఆలోగా ఏమైనా జరగవచ్చు.