జబర్దస్త్ కెమెడియన్ మూర్తి కన్నుమూత
మిమిక్రీ ఆర్టిస్ట్, జబర్దస్త్ కెమెడియన్ మూర్తి మృతిచెందారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మూర్తి మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మూర్తి సోదరుడు అరుణ్ ఈ విషయాన్ని మీడియాకు వివరించాడు. 2018 నుంచి జబర్దస్త్ తో సహా స్టేజ్ షోలపై చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెమెడియన్‌గా రాణిస్తున్న సమయంలోనే క్యాన్సర్ బారినపడ్డాడు. మూడు సంవత్సరాల్లో తాను సంపాదించినదంతా వైద్యం కోసమే ఖర్చు చేశానన్నాడు. సుమారు 15 లక్షలుపైగా వైద్యం కోసం ఖర్చు చేసినట్టు అనేక టీవీ షోల్లో చెప్పాడు. మూర్తి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో సహ నటులతోపాటు, సినీ పెద్దలు కొంత మేర సాయం చేశారు. మూర్తి మరణంపై బుల్లితెర కళాకారుల్లో విషాదం అలుముకొంది.


