Andhra PradeshHome Page SliderNewsPolitics

వారాహి కాదు అది నారాహి..

జనసేన, వైసీపీ పార్టీ మధ్య జరగుతున్న ట్వీట్‌ వార్‌పై మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. పవన్‌ కల్యాణ్‌పై ఘాటుగా విమర్శించారు. పవన్‌ వాహనం వారాహి కాదు నారాహి అని ఎద్దేవా చేశారు. 175 స్థానాలు గెలవాలనుకుంటున్న వైసీపీ… 175 మంది అభ్యర్థులు కూడా లేని జనసేనని చూసి ఎందుకు భయపడుతుందన్నారు. పవన్‌ వ్యాఖ్యలపై సీఎం జగన్‌ స్పందించాల్సిన పని లేదన్నారు. మీడియా అనవసరంగా పవన్‌కు ప్రాధాన్యత ఇస్తుందన్నారు . పవన్‌ దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్‌ అని రోజా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో బతికే పవన్‌ శ్వాస తీసుకోవాలా వద్దా అని అడగాల్సింది వైసీపీని కాదు.. కేసీఆర్‌, కేటీఆర్‌లని అడిగారన్నారు రోజా. పవన్‌ రకరకాల విన్యాసాలు చేస్తూ… పిచ్చి పిచ్చి ట్వీట్లతో యుద్ధానికి సిద్ధం అంటున్నారని.. వైసీపీ కూడా యుద్ధానికి రెడీగా ఉందని రోజా పేర్కొన్నారు.