Andhra PradeshHome Page SliderTelangana

ఈ నాలుగు రోజులు బయట తిరిగారో మాడు పగులుద్ది..!

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు ఎండలు మండే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎండ కాలం సీజన్‌ పూర్తిగా ప్రారంభం కాక ముందే వెదర్‌లో మార్పులు భారీగా వచ్చేస్తున్నాయంది. అయితే వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రతల్లో అసాధారణ పెరుగుదల నమోదు కానుందని హెచ్చరించింది.

ఈనెల 13 వరకు ఎండ భారీగా పెరుగుతుందని.. ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తాయని అధికారులు లెక్కగట్టారు. ఇవాళ, రేపు అంటే ఏప్రిల్ 10,11 రోజుల్లో జిల్లాల్లో బుధవారం నుంచి ఏపీ, తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని, బయటకు రాకుండా ఉంటే బెటరంది. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు చెప్పారు.

ఇక ఏపీలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న ఆదివారం 41 డిగ్రీలు నమోదు కాగా, ఉత్తరాంధ్రలో వడగాలుల బీభత్సం ఎక్కువుతుందని అధికారులు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 45 డిగ్రీలు, మరికొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వొచ్చని పేర్కొంది. ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వివరించింది.