Home Page SliderNews AlertTelangana

కళాకారులే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు…

హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ వాయిద్య కళాకారుల మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాటి రాచరికంలో రాజులు కళలను, కళాకారులను, ఆస్థాన కవులను గుర్తించి, గౌరవించారన్నారు ఈటల. కానీ ఇప్పటి మన పాలకులు ఆదరించడం లేదు అని.. ఇక్కడ ఉన్న కళాకారులు వాపోతున్నారన్నారన్నారు. మనిషి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాతవాటినే మళ్లీ పాటిస్తున్నారన్నారు. ఎంత సంపద, టెక్నాలజీ ఉన్నా.. మధుర స్మృతులను, మానవ సంబంధాలను మనిషి కోల్పోతున్నాడన్నారు..

రైలు నడవడానికి రెండు పట్టాలు ఎంత ముఖ్యమో.. అభివృద్ధి, విలువలు రెండు అంతే ముఖ్యమన్నారు. అవి లేకపోవడం వల్లనే మనిషి మృగంగా మారే సందర్భాలు చూస్తున్నామన్నారు. జరుగుతున్న దుర్మార్గాలు అంతం కావాలంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు పెంపొందాలి. కళాకారులు కుటుంబాన్ని పోషించే స్థితిలో లేరు. వారికి సాయం చేయడం అంటే సమాజానికి సేవ చేయడం. ధూమ్ ధాం తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. ప్రజల బాధలని కళ్ళకు కట్టినట్టు చూపించింది పాట. చైతన్యాన్ని రగిలించేది కళలు మాత్రమేనని ఈటల రాజేందర్ వివరించారు.