హైదరాబాద్‌లో మూడు చోట్ల ఐటీ సోదాలు
తెలంగాణా రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో తరచూ ఐటీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటివరకు షాపింగ్‌మాల్స్‌పై ఐటీ అధికారులు వరుస సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం వారు కెమికల్ కంపెనీలపై దాడులు చేస్తున్నారు. ఇవాళ బాలానగర్‌లోని రెండు కెమికల్ కంపెనీల్లో ఐటీ తనిఖీలు నిర్వహించింది. అయితే మొత్తం 6 బృందాలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వరుస ఐటీ దాడులతో పలు సంస్థల యజమానులు కలవరపడుతున్నారు.

