రుచి పెంచడమే కాదు..బరువు కూడా తగ్గిస్తుంది
ఆహారంలో కారం పాళ్లు ఎక్కువగా తీసుకుంటే రుచి బాగుంటుందని మనకు తెలుసు. చాలామంది కారం పదార్థాలు ఇష్టపడతారు. శరీరంలో మెటబాలిజాన్ని కూడా కారం నియంత్రిస్తుందని పరిశోధనలలో తెలిసింది. మసాలా,కారం పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతుందట. స్పైసీ ఫుడ్స్ కేలరీలను కూడా కరిగిస్తాయని కనిపెట్టారు. దీనిలో ఉండే క్యాప్సైసిన్ నోటిలో హీట్ సెన్సింగ్ బడ్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. జీవక్రియలను కూడా వేగవంతం చేస్తుంది. దీనితో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. క్యాప్సైసిన్ కేలరీలను బర్న్ చేయడమే కాకుండా కొవ్వును కూడా విచ్ఛిన్నం చేస్తుంది. ఇలా చేయడాన్ని లిపోలిసిస్ అంటారు. దీనివల్ల శరీరం త్వరగా వేడెక్కుతుంది. దీనితో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతుంది.


 
							 
							