Andhra PradeshNews

ఆమెకు 31… బాలుడికి 14

Share with

ఆమె వయసు 31 ఏళ్లు. పెళ్లైంది. భర్త, ఇద్దరు పిల్లలున్నారు. చక్కగా సాగే జీవితంలో పక్కచూపులు చూసింది. స్థానికంగా ఉండే చిన్నారులతో నిత్యం సెల్‌ఫోన్‌లో హౌసీ గేమ్‌ ఆడుతూ వారిని ఆకర్షిస్తూ ఉండేది. ఆంటీ అంటూ ఇంటికొచ్చే ఎదురింటి కుర్రాడిపై మనసుపడింది. అతడి వయసు 14ఏళ్లు. ఆ బాలుడిలో ఏం చూసిందో ఏమో.. వాడ్ని ముగ్గులోకి దించింది. అంతేకాదు ఈ వయసులో చేయకూడని పనులన్నీ చేయించింది. చివరకు ఓ మంచి రోజు చూసుకొని బాలుడ్ని తీసుకొని వెళ్లిపోయింది. కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం సృష్టించిన మహిళ, బాలుడి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది.

గుడివాడ పట్టణానికి చెందిన స్వప్న అనే మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా వారి ఎదురింట్లో ఉండే ఎనిమిదవ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో చనువుగా ఉంటోంది. స్వప్నకు బాలుడితో శారీరక సంబంధం కూడా ఉంది.ఈ క్రమంలోనే ఈనెల 19న అతడ్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తొలుత ఆమె బయటకు వెళ్లిందని కుటుంబ సభ్యులు భావించారు. ఎదురింట్లో బాలుడు కూడా కనిపించకపోవడంతో ఇద్దరూ కలిసి వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్నారు. స్వప్నపై బాలుడి తండ్రి కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఘటన సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ జరిపారు. బాలుడితో స్వప్నకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. దీంతో ఇద్దరం కలిసి వెళ్లిపోతే హాయిగా ఉండొచ్చని బాలుడ్ని నమ్మించి,ఈనెల 19న బాలుడ్ని తీసుకొని హైదరాబాద్ వెళ్లింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత బాలుడు గుడివాడలోని తన ఇంటికి వెళ్లాలని భావించాడు. తన వద్ద డబ్బులు లేవని.. డబ్బులు పంపాలని స్నేహితులు, చుట్టు పక్కల వారికి ఫోన్‌లో మెస్సేజ్‌ పెట్టాడు. ఎవరూ స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తాను హైదరాబాద్‌లో ఉన్నానని, ఇంటికి వస్తానని చెప్పాడు. అప్పటికే జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు గుడివాడ టూటౌన్‌ స్టేషన్‌ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు ఏపీలోని వివిధ జిల్లాల్లో బాలుడి కోసం గాలింపు చేపట్టాయి. ఓ బృందం బాలుడు మాట్లాడుతున్న సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా గుర్తించి వారున్న ఇంటికి వెళ్లారు. మంగళవారం రాత్రి బాలానగర్‌లోని ఓ గదిలో బాలుడితో పాటు స్వప్న ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకోని గుడివాడ తీసుకొచ్చారు. విచారణలో స్వప్న షాకింగ్ విషయాలు చెప్పింది. బాలుడితో కొంతకాలంగా తనకు శారీరక సంబంధం ఉందని.. అతడితో కలిసి శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయినట్లు అంగీకరించింది. దీంతో స్వప్నపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు బాలుడి ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు స్వప్న వెళ్లిపోవడంతో కంగారుపడ్డ భర్త,పిల్లలు ఊహించని పరిణామంతో షాక్ తిన్నారు. ఇక కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.